2, జులై 2014, బుధవారం

మొక్కుబడి వాస్తవికత


మొక్కుబడి నిర్వచనం: మానవుడు ఒక ప్రత్యేక సందర్భంలో  తనపై విధిగా లేని ఒక కార్యాన్ని తనపై విధిగా చేసుకోవటాన్ని మొక్కుబడి అంటారు. ఉదాహరణకు: కొంత మంది పేదవారికి  బట్టలు పంచుతానని, కొందరి దాహార్తి తీర్చే ఏర్పాటు చేస్తానని, కొందరికి అన్నదానం చేస్తానని దైవానికి మొక్కుకోవడం వలన ఆ వ్యక్తిపై విధిగాలేని ఒక కార్యం మొక్కుబబడి చేసుకున్నాక విధిగా మారిపోతుంది.
మొక్కుబడి ఒక ఆరాధన: అల్లాహ్  మానవునికి నిర్దేశించిన ఆరాధనలు – నమాజు, రోజా, జకాత్‌, హజ్జ్‌, దుఆ మొదలయిన వాటిలాగే మొక్కుబడి కూడా ఒక ఆరాధన. మొక్కుబడి ప్రస్తావన అటు దివ్య ఖుర్‌ఆన్‌లోనూ, ఇటు దైవప్రవక్త (స) వారి హదీసుల్లో నూ వచ్చింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు”. (అల్‌ బఖర: 270) సజ్జనుల లక్షణం మొక్కుబడి తీర్చడం: మొక్కుబడి చేెసుకున్నాక తప్పక చెల్లించడం సజ్జనుల లక్షణమని ఖుర్‌ఆన్‌లోని దహ్ర్  అధ్యాయంలో పేర్కొనబడింది: ”వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు. కీడు నలువైపులా విస్తరించే రోజు గురించి భయపడుతుంటారు”. (76;7)  మొక్కుబడి చేసుకున్న ఈసా (ఏసు) అమ్మ మరియు అమ్మమ్మ: ప్రవక్త ఈసా (అ) వారి అమ్మమ్మ గర్భం దాల్చినప్పుడు ఇలా మొక్కుకుంది: ”ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి – ఇమ్రాను భార్య ఈ విధంగా వేడుకున్నది: ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్నదానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు”.   (ఆల్‌ ఇమ్రాన్‌: 35)
ప్రవక్త ఈసా (అ) గారి తల్లి మర్యమ్‌ (అ) సయితం  గర్భిణిగా ఉన్నప్పుడు అల్లాహ్  ఆవిడకు ఏ పురుష సంపర్కం లేకుండానే ప్రపంచానికి ఒక సూచనగా పుట్టించబోతున్న ఆ బిడ్డ ప్రత్యేకతను గ్రహించని జనులు అర్థరహితంగా ప్రశ్నలు వేస్తే ఏమి సమాధానం ఇవ్వగలనని హజ్రత్‌ మర్యమ్‌ (అ) కంగారు పడుతుంటే, అల్లాహ్  ఆమెను, ఉపవాసం మొక్కుబడి చేసుకున్నాను ఎవ్వరితోనూ మాట్లా  డనని సమాధానమివ్వమన్నాడు: ”ఏ మనిషైనా నీకు తారసపడితే నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడనను” అని చెప్పు.     (దివ్యఖుర్‌ఆన్‌ 26)
మొక్కుబడి నియమాలు: మొక్కుబడి గురించి అల్లాహ్  మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు కొన్ని నిబంధనలు, నియమాలను తెలియజేశారు. అవేమంటే…. 1) మొక్కుబడి తప్పక నెరవేర్చాలి: మొక్కుబడి చేసుకున్నవారు తప్పనిసరిగా తమ మొక్కుబడిని చెల్లించాలి: ”ఆ తర్వాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి. తమ మొక్కుబడులను చెల్లిం చాలి”. (హజ్జ్:29)  2) మరణించిన వారి మొక్కుబడిని వారి వారసులు చెల్లించాలి: మొక్కుబడి చేసుకున్న వారు మొక్కుబడి తీర్చకుండానే మరణిస్తే వారి వారసులకు ఆ విషయం తెలిసి ఉంటే వారు ఆమొక్కుబడిని తీర్చాలి. ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవిత కాలం లో జుహైనా తెగకు చెందిన ఒక మహిళ ఆయన (స) వద్దకు వచ్చి - ‘ఓ ప్రవక్తా (స)! నా తల్లి హజ్జ్‌ చేస్తానని అల్లాహ్‌తో మొక్కుబడి చేసు కొని మొక్కుబడి  తీర్చక ముందే మరణించింది. ఆమెకు బదులుగా నేను ఆ మొక్కుబడి  తీరిస్తే చెల్లుతుందా?’ అని అడిగింది. దానికి ప్రవక్త (స) ”నువ్వు తప్పనిసరిగా ఆమె మొక్కుబడిని చెల్లించా”లని నొక్కివక్కాణించారు. (బుఖారీ)
3) ధర్మం సమ్మతించిన విషయాల పరిధిలోనే మొక్కుబడి  చేసుకోవాలి: దైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”దైవాజ్ఞ  విదేయత కొరకు మొక్కుబడి చేసుకున్న వ్యక్తి ఆ మొక్కుబడిని చెల్లిం చాలి”.(ముత్తఫఖున్‌ అలైహి) ఉదాహరణకు- నమాజు, ఉపవాసం, ఉమ్రా, ధాన ధర్మాలు మొదలయినవి. 4) అధర్మ కార్యాల్లో మొక్కుబడి  చేసుకోకూడదు: అల్లాహ్‌ా నిషేధించిన కార్యాలపై మొక్కుబడి చేసుకోరాదని ప్రవక్త (స) సెలవిచ్చారు. ”దైవ అవిధేయతా విషయమై మొక్కుబడి  చేసుకున్న వ్యక్తి ఆ మొక్కుబడి చెల్లిందకూడదు”.(ముత్తఫఖున్‌ అలైహి) ఉదాహరణకు: నేను పది మందికి సారాతాపిస్తాననో,ఖవ్వాలీ  పెట్టిస్తాననో,సమాధిపై చాదర్‌ కప్పుతాననో మొక్కుబడి  చేెసుకోవ డం. పై కార్యాలన్నీ హరామ్‌. కాబట్టి ఇలాంటి మొక్కుబడులు చేసుకోరాదు. ఒకవేళ తెలియని కారణంగా చేసుకొని ఉన్నా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించకూడదు.
5) తన ఆధీనంలో లేని విషయాలపై మొక్కుబడి చేయరాదు: మనషి తన శక్తిసామర్థ్యాలకు మించిన విషయాలపై మొక్కుబడి  చేసుకోరాదు.’తన ఆధీనంలో లేని విషయాలపై మానవుడు మొక్కుబడి  చేయరాదు’ అని ప్రవక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం) 6) అర్థరహితమయిన విషయాలపై మొక్కుబడి  చేయరాదు: అనవసరమయిన, అర్థరహితమయిన విషయాలపై మొక్కుబడి  చేయరాదని ప్రవక్త (స) వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఓ సారి ప్రవక్త (స) మస్జిద్‌లో ప్రసంగిస్తుండగా అబూ ఇస్రాయీల్‌ అనే పేరు గల సహాబీ మస్జిద్‌ వెలుపల ఎండలో నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రవక్త (స)  ఎందుకు ఆ వ్యక్తి బయటనే నిలబడి ఉన్నాడు? అని ప్రశ్నించారు. అతను ‘ఎండలోనే ఉంటాను; నీడలోకి వెళ్ళను, నిలబడే ఉంటాను; కూర్చోను, మౌనంగానే ఉంటాను; ఎవరి తోనూ మాట్లాడను, పస్తులతోనే ఉంటాను; ఏమి తినను’ అని మొక్కుబడి  చేసుకున్నాడని ఇతర సహాబాలు తెలిపారు. అది విన్న ప్రవక్త (స) (అతని ఆ చర్యకు గర్హిస్తూ) ‘అతన్ని వెంటనే నీడలోకి వచ్చి, కూర్చోని, మాట్లాడమని చెప్పండి. ఆఁ ఉపవా సాన్ని అతను పూర్తి చేయాలి’ అన్నారు. (బుఖారీ)
7) మొక్కుబడి కేవలం అల్లాహ్ తో మాత్రమే చేసుకోవాలి: మొక్కుబడి ఒక ఆరాధన అని మనం ఇదివరకే తెలుసుకు న్నాము. ఆరాధన పెద్దదయినా, చిన్నదయినా అది కేవలం అల్లాహ్‌ా కొరకు మాత్రమే చేయాలని అల్లాహ్  తాకీదు చేశాడు.  ”మీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు మీరు ఆయనను తప్ప మరొకరిని ఆరాధించకూడాదు”. (ఇస్రా: 23) ”అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”. (నిసా: 736)  పై ఆయతుల దృష్ట్యా మనం మన ఉపాసనారీతులన్నింటిని అవి – ధనపరమైనవైనా, వాక్కుపరమయినవైనా, కర్మపరమయినవైనా అల్లాహ్  కొరకు మాత్రమే ప్రత్యేకించాలి. ఇతరుల పేర మొక్కుబడి చేసుకోవడం అనేది ముమ్మాటికి బహుదైవారాధనే అవుతుంది. షిర్క్‌ – బహుదైవారాధనను అల్లాహ్  ఎన్నటికి మన్నించడు. అయితే ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక మంది ముస్లిం సోదరులు జెండా మాన్ల వద్ద, పీర్ల ప్రతిమల వద్ద, దర్గా ల (సమాధుల) వద్ద, పుట్టల వద్ద, పాముల వద్ద మొక్కుబడు చేసుకుంటున్నారు. అంతే కాకుండా వందల మైళ్ళు ప్రయాణం చేసి మరీ తలనీలాలు సమర్పించుకొని చేసుకున్న మొక్కుబడులు తిర్చేసుకున్నామని మురిసిపోతున్నారు. వాస్తవానికి వారు అల్లాహ్‌ాకు ఇతరలను భాగస్వాములుగా చేసి మహా పాతకానికి, ఘోర పాపనికి ఒడిగడుతున్నారు. వారి తక్షణ చర్య ఏమిటంటే, వెంటనే వారు చేసిన నిర్వాకంపై కన్నీరుమున్నీరవుతూ కరుణా మయుని సన్నిధిలో తౌబా చేసుకోవాలి. జీవితంలో ఇకమీదట అటువంటి పాతకానికి పాల్పడమని లెంపలేసుకొని మరీ ప్రతీన బూనాలి.
మొక్కుబడి వల్ల ప్రయోజనం: మొక్కుబడి చేెసుకోవడం వల్ల ఏదో పెద్ద మహిమే జరిగిపోతుందని భావించడం తరచూ మనం చూస్తూ ఉంటాము. ఇదంతా ఓ అభూత కల్పన, ఒఠ్ఠి భ్రాంతి మాత్రమే. వాస్తవంగా మొక్కుబడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) తేల్చి చేప్పేశారు: ”నిశ్వయంగా మొక్కుబడి విధివ్రాతను ఎంత మాత్రం మార్చ జాలదు. మొక్కుబడి ద్వారా అల్లాహ్  పిసినారి నుండి కొంత సొమ్మును రాబట్టుతాడు అంతే”. (బుఖారీ)  ధార్మిక పండితుల అభిప్రాయం: మొక్కుబడి నిశ్చయంగా ఒక ఆరాధన. కాకపోతే ఇది అయిష్టకరమయినది. ఎందుకంటే షరతుతో కూడిన మొక్కుబడి ద్వారా దాసుడి స్వార్థప్రియత్వం బహిర్గతమవుతుంది. దాసుడు ఒక మంచి కార్యం చేయడానికి అల్లాహ్ తో షరతు పెట్టుకుంటాడు. నా ఫలాన కోరిక తీరితే నేను ఫలానా సత్కార్యం చేస్తాను అని మొక్కుబడి చెసుకోవడంతో అతని స్వార్థం బట్టనయలవుతుంది. అంటే, అతని కోరిక తీరితేనే అతను పుణ్యకార్యం చేస్తాడు; అన్యదా చేయడన్న మాట. ఈ కారణంగానే కొందరు ధర్మవేత్తలు షరతుతో కూడిన మొక్కుబడిని లంచంతో పోల్చారు. అయితే ఎలాంటి షరతు పెట్టకుండా ఒక మంచి కార్యా న్ని తమపై విధిగా చేసుకోవడం మాత్రం అభిలషనీయమన్నారు.
ఇక షరతుతో కూడిన మొక్కుబడి చేసుకునేవారు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎవరయినా మన వద్దకు వచ్చి మీరు నా ఫలాన పని చేసి పెడితే ప్రతిగా నేను మీ ఫలానా కార్యం చేసి పెడతాను’ అనంటే అతన్ని పచ్చ స్వార్థపరుడి క్రింద జమకడతాముగా! మరి మనమే ఆ పని చేస్తున్నామాయే! అదీ ఎవరితో! అనంత కరుణా మయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ాతో – నువ్వు నా ఫలానా పని చేసి పెడితే నేను ప్రతిగా ఫలానా పని చేస్తాను అని అల్లాహ్‌ాతో ఒప్పందానికి దిగడం ఎంత వరకు సమంజసం?  ఈ కారణంగానే ఇటువంటి షరతుతో కూడిన మొక్కుబడి ధర్మసమ్మ తమయినప్పటికీ దాన్నో అయిష్టకరమైన కార్యంగానే ఎంచారు ధర్మవేత్తలు.  ముఖ్య గమనిక: మొక్కుబడి చేసుకునేవారు అధర్మ విషయాలపై చేసుకోకుండా జాగ్రత్త పడటమే కాకుండా పూర్వం అజ్ఞాన కాలంలోగానీ, ప్రస్తుతంగాని విగ్రహాల, ఔలియాల పేరిట బలిచ్చే ప్రదేశాల్లో తమ పశువులను జిబహ్‌ా చేస్తామని మొక్కుకోకూడదు.
ఒక వ్యక్తి మొక్కుబడి చేసుకొని తీర్చలేకపోతే – అది షరతుతో కూడిన మొక్కుబడి అయినా ఎలాంటి ముందస్తు షరతు లేని మొక్కుబడి అయినా సరే అతను పరిహారం (కఫ్ఫారా) చెల్లించాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఇటువంటి ప్రమాణ భంగానికి మీరు చెల్లించవలసిన) కప్ఫారా ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్య రకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి. లేదా (మీరు మీ ఇంటి వారికి తొడిగించే మధ్య రకపు) బట్టలు వారికివ పెట్టాలి. లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేని వాడు మూడు రోజులు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణాలు చేెసినప్పుడు (వాటిని భంగపరచినందుకుగాను ఇచ్చే) పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ విధంగా మీరు కృజ్ఞతా పూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్‌ా మీ కోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు”. (మాయిదా: 89)

నరక విశేషాలు


”మరి ఎవరయితే హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితా నికే ప్రాధాన్యమిచ్చారో వారికినరకమే నివాసమవు తుంది”.   (నాజిఆత్‌: 37-39)
మనిషి చనిపోతాడు. పాము కుబుసం వదలి ముందుకు సాగిపో యినట్టు ఎంతో నాజుకూగా పెంచుకున్న గారాల దేహాన్ని వీడి మనిషి ఆత్మ పరలోకానికి పయనమవుతుంది. దానికి భౌతిక నేత్రాలయితే లేవుగానీ అది చూడగలుగుతోంది. దానికి మనకులాగు వీనులు లేవు గానీ, అది వినగలుగుతుంది. నరకం ఉందంటే నరలోకాన్నే నాకంలా భావించే కొందరు భ్రమ జీవులు ఎగిరి గంతులేస్తారు. కోపంతో కారాలు మిరియాలు నూరుతారు. సమాధి చేయబడిన శవం మట్టిలో కలిసి మట్టయిపోతుందనుకుంటారు. కాల్చబడిన శవం బూడిదయి కాటి మట్టిలో కలిపోతుందనుకుంటారు. ఐహిక జీవితం తప్ప పర లోక జీవితం లేదన్నది వీరి బలమయిన వాదన. దేహంకన్నా ఆత్మ కున్న ప్రాముఖ్యతను వీరు గమనించేందుకు సుముఖంగా ఉండరు. శరీరానికి మెరుగులు దిద్దుకుంటారేగానీ, ఆత్మను ప్రక్షాళనం చేసుకు నేందుకు ప్రయత్నించరు. దాని గురించి ఆలోచించనన్నా ఆలోచిం చరు. సమాధి యాతన అనేది ఎంత నికృష్టమయినదో, అక్కడికి చేరిన ఆత్మలు ఎంతగా అల్లాడిపోతాయో,  సమాధిలో పుణ్యాత్మలకు లభించే ఫలం ఎంత


    విధివ్రాత నియమాలు – 3


    3) సృష్టి నిర్మాణం అల్లాహ్  యుక్తికి లోబడి జరిగింది
    ప్రపంచం కేవలం ఒక క్రీడారంగం, వడ్డించిన విస్తరి, విలాస స్థలం ఎంతమాత్రం కాదు. సృష్టిశ్రేష్ఠుని సృజన సయితం ఏదో అల్లాటప్ప గా, అర్థరహితంగా జరుగలేదు. అవిశ్వాసులు దైవ తిరస్కారులు భావించినట్లు అల్లాహ్  ఈ సృష్టిని లక్ష్యరహితంగా చేయలేదు. ఇదే విష యాన్ని ఆయన ఇలా తెలియజేస్తున్నాడు: ”మేము ఈ గగన భవనాలను వీటిలో ఉన్న సమస్తాన్నీ ఏదో ఆటగా సృజించలేదు.” (అన్బియా:16)
    మరో చోట ఇలా సెలవియ్యబడింది: ”మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలి రావటం అనేది జరగని పని అని అనుకు న్నారా?”. (మోమినూన్‌:115))
    ”మేము ఆకాశాలనూ భూమినీ, వాటి మధ్య నున్న సమస్త వస్తువులనూ సత్యబద్ధంగానే సృష్టించాము”. (హిజ్ర్‌:85))
    ”భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అల్లాహ్  దే – ఆయన దుర్జనులకు వారి దుష్కర్మలకు దుష్ఫలం, సజ్జనులకు వారి సత్కర్మలకు సత్ఫ లితం ఇచ్చేటందుకు ఈ వ్యవస్థ ఏర్పరచ బడినది.” (నజ్మ్‌:31))
    నిజం ఏమిటంటే, మనం మన కోసం బాధా కరం, నష్టదాయకం అనుకున్నదే మన పాలిట శుభకరం కావచ్చు. ”దేన్ని మీరు ఇష్ట పడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో ఇష్టపడి కోరుకునే విషయాలే మీ పాలిట కీడు గా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్‌ాకు మాత్రమే ఉంది. ఆ విషయం మీకు తెలి యదు.” (బఖర:216)
    అల్లాహ్‌ా మనల్ని ఏదో ఒక విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో భయంతోనూ, మరికొన్ని సందర్భాల్లో ఆకలిదప్పులతోనూ, ఇంకొన్ని సందర్భాల్లో ధనప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతోనూ, కరువుకాటకాలతోనూ పరీక్షిస్తాడు. దైవం పట్ల, ఆయన విధిరాత పట్ల విశ్వాసం సన్నగిల్లినవారు, లేదా బొత్తిగా నమ్మకం లేనివారు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వాటినే అసలు అసాఫల్యానికి ఆనవాలుగా తలపోస్తారు. దీనికి భిన్నంగా విశ్వాసులు ఇటువంటి దుస్థితి ఎదురైనప్పుడు వారి విశ్వాసం మరింత వికసిస్తుంది. ద్విగుణీ కృతమైన విశ్వాసంతో వారు అల్లాహ్‌ాను ఇలా వేడుకుంటారు: ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నర కాగ్ని నుండి కాపాడు.” (ఆలి ఇమ్రాన్‌ :191)
    ఇంకా ఇలా వేడుకుంటారు: ”ఓ మా పోష కుడా! నువ్వెరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. మా ప్రభూ! పిలిచేవాడొకడుఈమాన్‌ (విశ్వాసం) వైపునకు-ప్రజలారా! మీ ప్రభువు ను విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసిం చాము. కనుక ఓ ఫ్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.” (ఆలి ఇమ్రాన్‌: 192-193)
    ప్రతిగా అల్లాహ్‌ా ఏమని సమాధానిస్తున్నాడో కూడా కాస్త గమనించండి: ”వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పని చేసేవారి పనిని వారు పురుషులైనా స్త్రీలైనా సరే నేను వృధా చేయను.” (అని వాగ్దానం చేశాడు)  (ఆలి ఇమ్రాన్‌:195))
    కాబట్టి ”నగరాలలో దైవ తిరస్కారుల సేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే”  (ఆలి ఇమ్రాన్‌ : 196,197)
    4) మేలు లేని కీడును అల్లాహ్  సృష్టించ లేదు.
    మంచీచెడులు సృష్టించిన వాడు అల్లాహ్ యే. ఇందులో ఏ విధమైనటువంటి సందేహంలేదు. సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే, కార్బన్‌ ఆక్సిడ్‌ మన పాలిట కీడుగా పరిణ మించినా, మనం ఆక్సిజన్‌ని ఎలా పీల్చి బ్రతు కుతున్నామో మనకు ఆ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న వృక్షాలు కార్బన్‌ ఆక్సిడ్‌ శ్వాసించి జీవిస్తున్నాయి.
    కనుక అల్లాహ్‌ా ఏది చేసినా మానవ శ్రేయం, మేలు కోసమే. ఇక కీడును మనం దైవానికి ఆపాదించకూడదు. ఎందుకంటే, మేలు అన్నది కేవలం దైవకృప మాత్రమే. ఇక కీడు అంటారా! అది మనిషి చేసిన దుష్కర్మలకు గాను లభించే ప్రతిఫలం. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, మావునికి కలిగే కీడు కూడా విధివ్రాతలో రాయబడి ఉన్నదే! అయితే అంతిమంగా విధివ్రాత మొత్తం మేలు తో కూడుకున్నదిగానే భావించాలి. ఈ విధం గా అల్లాహ్‌ా కార్యాలన్నీ కూడా మేళ్ళే అవు తాయి. ఈ కారణంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ‘వష్షర్రు లైస ఇలైక’ కీడు అన్నది నీ తరపున కాదు. అన్నారు.నిజం ఏమిటంటే, మనకు ప్రాప్తమయి ఉన్న జ్ఞానం అర్థం చేసు కునే శక్తి బహు స్వల్పం. ఎలా అంటారా?
    హజ్రత్‌ మూసా (అ) స్వయంగా దైవ ప్రవక్త అయినప్పటికీ హజ్రత్‌ ఖిజర్‌ (అ) వారి సహ చర్యంలో ఉన్నప్పుడు జరిగిన మూడు సంఘ టనల వెనుక ఉన్న యుక్తి ఆయనకు బోధ పడలేదు. మూడింటిని ఆయన కీడుగానే భావి ంచారు. అయితే నిజం తెలిశాక ఆయన విశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది. ఎందులో ఏముందో మనకు తెలియదు గనక ప్రవక్త (స) తరచూ ఈ దుఆ చదువుతూ ఉండమ న్నారు. ”అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్‌ షర్రి మా ఖలఖ్‌ – నేను సృష్టిరాసుల కీడు నుండి అల్లాహ్‌ా యొక్క సంపూర్ణ వచ నాల రక్షణలోకి వస్తున్నాను.” (ముస్లిం)

    మరణం తప్పదు మనిషికి


     ”భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”. (అర్రహ్మాన్: 26,27)
      దైవ ప్రవక్త (స), హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌ (ర)ను ఉద్దేశించి ఇలా అన్నారు: ”ఇహలోకంలో నీవు ఒక బాటసారిలా జీవించు. లేదా దారిన నడిచివెళ్ళే సామాన్యుడిలా ఉండు. సాయంత్రం అయితే ఉదయానికై ఎదురు చూడకు. ఆరోగ్యాన్ని అనారోగ్యం కన్నా మేలైనదిగా తలంచు. మరణం కన్నా జీవితం గొప్పదని భావించు”. (బుఖారీ)
      అవును – కనులు తెరిస్తే జననం. కనులు మూస్తే మరణం. ఈ రెప్పపాటులోనే ఉంది జీవన పయనం. ఇలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మరణం మజా చవిచూడ వలసిందే. మనం ఈ అవనికి వచ్చినప్పుడే రిటర్న్‌ టికెట్‌తో వచ్చాము. అందులో మనం తిరిగి వెళ్ళాల్సిన తేదీ కూడా ఖరారయి ఉంది. ఆ ఘడియ దాపురించినప్పుడు ఒక్క సెకను కూడా ఆలస్యం అవదు. కానీ అదెప్పుడన్నది వీడని మిస్టరీ. మనకు తెలియదు, అంతుబట్టదు. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా అభివర్ణిస్తుంది.
    ”తాను రేపు ఏం సంపాదించనున్నదో, తనకు మరణం ఏ భూభాగంలో సంభవించ నున్నదో(ఈ ధరణిలోని) ఏ ప్రాణీ ఎరుగదు”.
      ఈ ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. 1) నిద్రావస్థలో ఉన్నవారు. 2) మేల్కొని ఉన్నవారు. నిదురపోతున్న వ్యక్తి వెళ్ళాల్సిన రైలు బండి వెళ్ళిపోతుంది. అతను చేయాల్సిన ప్రార్థనా వాయిదా పడుతుంది. అతని సంపదా దోచుకోబడుతుంది. అతను ఎలాంటి సత్కారానికి, సన్మానానికి నోచుకో లేడు. ఎటువంటి వరాలూ అతన్ని వరించవు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను సమస్త సౌభాగ్యాలను కోల్పోయిన పరమ దౌర్భాగ్యుడు. కారణం నిద్ర. అది సగం మరణంతో సమానం గనక. అవును; మఱ పొందువారికి మలయదు కీర్తి.
      ఇక నిద్రావస్థలో ఉన్న వ్యక్తి మరణించిన వానితో ఎలా సమానం అంటారా!? చూడండి! మరణించిన వ్యక్తి భౌతిక, బాహ్య అనుగ్రహాలన్నింటికి దూరమైపోతాడు. షడ్రుచులు మేళవించియున్న ఆహార పదార్థాలు వడ్డించబడి ఉన్నాయి; కానీ తను తినలేడు.పొందికైన దుస్తులు అల్మారాలో అందంగా అమర్చబడి ఉన్నాయి; కానీ తను తొడగలేడు. ప్రాణ సఖి అయిన ప్రియ ధర్మచారిణి తనతో పలుకరించేందుకు, తన పిలుపు విని తరించేందుకు పరితపించి పోతూ ఉంది; కానీ తను ఏమీ అనలేడు. ప్రాణాధికంగా పెంచిపోషించిన సంతానం చుట్టూ గుమిగూడి తదేకంగా తననే చూస్తున్నారు; కానీ తను మాత్రం వారిని కనలేడు. కన్నవారి కళ్ళు అశ్రువుల్ని కుమ్మరించి కాయలు కాచి ఉన్నాయి; కానీ తను ఓదార్చలేడు. ఎంతో దర్జాగా బ్రతికిన తన సుందర దేహంపై రెండే రెండు తెల్లటి దుప్పట్లు కప్పబడి ఉన్నాయి. తనను జనాజాలో పెట్టి భుజాలపై మోసుకెళు తున్నారు. జనాజా నమాజు ముగిసింది. సమాధిలో దించి తలా పిడికెడు మన్ను ఎత్తిపోస్తున్నారు దీవెనగానే. తన ఆరడుగుల అందమైన శరీరాన్ని కాటి మట్టిలో కలిపేస్తున్నారు; అయినా తనేం చేయలేడు.
      ఇంచుమించు ఇటువంటిదే మనసు చచ్చిన వ్యక్తి ఉదాహరణ. తన అంతరాత్మ ఘోషను నిర్ధాక్షిణ్యంగా అణచి వేసిన ఈ మనుజ కుమారుడు తనకు ప్రాప్తించాల్సిన ఆత్మా నుగ్రహాలను కోల్పోతున్నాడు. నమాజులు సలుపువారు నమాజులు చేస్తున్నారు. వారి పుణ్యకార్యాలకు బదులు స్వర్గంలో అందమైన భవనాలు నిర్మించ బడుతున్నాయి. కానీ నిద్రావస్థలో ఉన్న ఈ సోంబేరి తన అలసత్వం,  కారణంగా స్వర్గ సౌఖ్యాలను జారవిడుచుకుంటున్నాడు. వ్రతాలు ఆచరించేవారు ఉపవాసాలుంటు న్నారు. ఫలితంగా స్వర్గంలో దైవ దర్శనా భాగ్యం లభిస్తుందన్న శుభవార్తతో అమందానంద కందళిత హృదయార విందులై ఆత్మానంద సుందర బృందావనాల్లో విహరిస్తున్నారు. కానీ తిండిబోతులకు సాకులు వెతికేందుకే సమయం సరిపోవడం లేదు. అందుకే దైవప్రవక్త (స) అన్నారు: ”దైవస్మరణ చేసే వ్యక్తి ఉదాహరణ ప్రాణి వంటిదైతే, దైవకీర్తన చేయని వ్యక్త్తి ఉపమానం ప్రాణం పోయిన పీనుగ వంటిది” అని. (బుఖారీ)
      క్షణికావేశానికి లోనై, ఏమరుపాటుకి గురై నేరం చేసిన వ్యక్తిని కోర్టు నిర్దోషని తీర్పు ఇచ్చినట్లు మనం ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఒక  నిద్రలోలుడు, సోంబేరి, మేల్కొన్న, చురుకైన వ్యక్తికన్నా ముందుకు వెళ్ళినట్లు మనం వినలేదు. అందుకే పెద్దలన్నారు – ”మేల్కొన్న వ్యక్తి చేతికి మణి మాణిక్యాలు అందితే, నిద్రిస్తున్న వ్యక్తి చేతికి మట్టి లభిస్తుంద”ని. ఎందుకంటే, నిద్రావస్థలో ఉన్న వ్యక్తి, మరణించిన వ్యక్తి ఉభయులూ సమానులే. అతనికీ ఏమీ తెలవదు. ఇతనికీ ఏమీ తెలియదు.
      ఒక్క నిమిషం ఆలోచించండి! ఖచ్చితంగా ప్రతి ప్రాణికి వచ్చి తీరే ఆ మరణ ఘడియ ఎంత భీతావహంగా, భయంకరంగా ఉంటుందో? అది ఎప్పుడు, ఎక్కడ, ఎటు నుంచి వచ్చి మన ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేస్తుందో ఒక్క మారు ఊహించండి. ఏ  క్షణం మన జీవిత నౌక మునిగిపోతుందో, ఏ క్షణాన మన బ్రతుకు తెల్లారుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించండి.
      మరణ శయ్య మీద ఓ రోగి అచేతనావస్థలో పడి ఉన్నాడు. చుట్టూ ఆప్తులు, అయినవారు గుమిగూడి ఉన్నారు. ఒకడేమో సూది గుచ్చుతున్నాడు. ఒకడు మాత్రలు మింగమంటున్నాడు. ఒకడేమో తేనె తినిపిస్తున్నాడు. ఒకడు చెంచాతో నీళ్ళు పోస్తున్నాడు. ఎవరు ఎంత చేసినా ఇది నయం కాని రోగం అని తెలుస్తూనే ఉంది,
       రోగి ముఖంమీద మరణచ్ఛాయలు వెక్కిరిస్తున్నాయి…చెమటలు విపరీతంగా పడుతున్నాయి…గుండెల్ని పిండేసే బాధేదో ప్రాణం  తోడేస్తున్నది…మెలమెల్లగా వెక్కిళ్ళు మొదలయినాయి…చెక్కిళ్ళు నల్లబడుతున్నాయి…పెదాలు పాలిపోతున్నాయి… గొంతు తడారి పోతున్నది… సన్నటి ఒణుకు వెన్నులో ప్రారంభమవుతున్నది… పొడుగాటి శ్వాసలు అధికమయినాయి…నేత్రాలు నింగినే చూస్తున్నాయి…. వాటిలోని తేజస్సు క్ష్షీణించిపోతున్నది…శరీరం మీది రోమాలు నిక్కబొడుచుకున్నాయి…వింత, విచిత్రమైన నిద్ర ఒడిలోకి జారుకుంటున్నట్లనిపిస్తున్నది… అల్లంత దూరం నుండి ఎవరో ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా”చదవమంటున్నారు…మరెవరో యాసీన్‌ సూరా పఠిస్తున్నట్లుంది… రెండే రెండు వెక్కిళ్లు….ప్రాణం అనే పక్షి పంజరం వదిలి ఎగిరిపోయింది…చేతులు రెండూ వాలిపోయాయి.. ఆ రోగి మ…ర…ణిం…చాడు…!! ”ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌”.
    ప్రియ సోదరులారా!
    జననం మన చేతుల్లో లేదు. మరణం కూడా మన చేతుల్లో లేదు. ఎలా జన్మించాలో, ఎక్కడ జన్మించాలో మనం నిర్ణయించలేము. ఎక్కడ మరణించాలో కూడా నిర్ధారించలేము. కానీ, ఎలా, ఏ స్థితిలో మరణించాలో- ఇది మాత్రం మన చేతిలోనే ఉంది. విశ్వాస స్థితిలోనా? అవిశ్వాస స్థితిలోనా? ఒక వర్గమేమో స్వర్గానికి, ఒక వర్గమేమో నరకానికి. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయంచుకోండి. ఆ మేరకు స్వేచ్ఛ అందరికీ ఉంది.

    విధిరాత నియమాలు-6


    ”భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ జీవనోపాధిని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌ాదే!  అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి.” (హూద్‌:6) మరో చోట ఇలా ఉంది: ”ఎన్నో జంతువులు ఉన్నాయి-అవి తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌ాయే ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (అన్‌కబూత్:60) అల్లాహ్‌ మరియు ఆయన పేర్లు గుణాలు తప్ప మిగతావన్నీ సృష్టి క్రిందికే వస్తాయి. ప్రతి వస్తువు సృష్టికర్త అల్లాహ్‌ాయే. ఉత్పత్తి దారుల్ని వారు ఉత్పత్తి చేసే సకల వస్తువులను పుట్టించినవాడు అల్లాహ్‌ాయే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్థారించాడు.”  (అల్‌ ఫుర్ఖాన్:2)
     8) అల్లాహ్‌ను మినహా మిగతావన్నీ సృష్టిరాసులే:
     సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు. ప్రతి వస్తువు విధి వ్రాతను ముందే చేశాడు. ప్రవక్త ఈసా (అ) ఇలా హితవు పలికారు: ”అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి యైనను,ఏమి ధరించుకొనుమో అని మీ దేహ మును గూర్చియైనను చింతింపకుడి; ఆహార ముకంటే వస్త్రముకంటే దేహమును గొప్పవి కాదా?! ఆకాశ పక్షులను చూడుడి: అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయి నను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా?! మీలోనెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?! వస్త్ర ములను గూర్చి మీరు చింతింపనేల? అడవి పువ్వులు ఏలాగు నెడుగుచున్నవో ఆలోచిం చుడి. అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వృభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలం కరింప బడలేదు.నేడుండి రేపు పొయిలోవేయ బడు అడవి గడ్డిని దేవుడేలాగు అలంకరించిన యెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చ యముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి, ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతించు కుడి; అన్య జనులు వీటన్నిటి విషయమై విచా రింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింప బడును. రేపటి గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును”. (మత్తయి:25-34)
     దైవ ప్రసాదితమైన ఆహారం సర్వసాధారణ మయినది. ఎవరు ఎక్కడ ఉన్నా వారి పేర రాసి పెట్టిన జీవనోపాధి తప్పక వారికి లభి స్తుంది. కనుక దైవమార్గంలో కష్టాలు ఎదుర యితే, ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రదేశానికి వలస పోవలసి వస్తే మనం మన జీవనోపాధి గురించి అదే పనిగా చింతించాల్సిన అవసరం లేదు. మనలో కొందరు బలవంతులుగా ఉం డగా, మరి కొందరు బలహీనులుగా ఉన్నారు.
    కొందరి దగ్గర ఒనరులు పుష్కలంగా ఉంటే, మరి కొందరి దగ్గర ఒనరులే లేవు. కొందరు స్వస్థలంలో సర్వ స్వతంత్య్రాలతో ఉంటే, మరి కొందరు ఆప్తులను, ఆస్తిపాస్తులను వదులుకు ని విదేశాలకు వలస పోయి జీవిస్తున్నారు.  వారందరికీ జీవనోపాధి    సక్రమంగా  లభి స్తుంది. భూమి లోపల తలదాచుకునే చీమలు మొదలుకుని, గాలిలో రెక్కలు చాచి ఎగిరే పక్షులు, నీటిలో ఈదే చేపలు, జల జంతువుల వరకు ఆన్నింటికీ అల్లాహ్‌యే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు.
     కనుక అల్లాహ్‌ాను నిశ్వసించేవారు వారికి ఏదైనా లాభిస్తే పొంగిపోరు. నష్టమొస్తే కృంగి పోరు. కలిమిని, లేమిని వారు దైవ పరీక్షగా ఎంచుతారు కాబట్టి పేదరికం వారిని బాధిం చదు. ఆకలిబాధ వారిని వేధించదు. కడుపు నిండిన రోజు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. కడుపు కాలిన రోజు ఓర్పు సహనాలు వహి స్తారు. లేమీ వారి పాలిట వరంగా, కలిమీ వారి పాలిట వరంగా పరిణమిస్తుంది. మహా ప్రవక్త (స) వారి ప్రియ సహచరుల జీవితమే వారికి స్పూర్తి. వారు దైవమార్గంలో తన, ధన, మానాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయిన మీదట మునుపటికన్నా శ్రేష్ఠమైన జీవనోపాధి ని అల్లాహ్‌ా వారికి ప్రసాదించాడు.అంతేకాదు, చిర కాలంలోనే ప్రపంచంలోని పెక్కు ప్రాంతా లకు వారిని అధికారులుగా చేశాడు. అయితే ఇక్కడో సృష్టికర్త నియమం ఉంది. అదే అవి రళకృషి!ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవియ్యబడింది: ”మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషించండి …. అల్లాహ్‌ ఉపాధి ప్రదాతలలోకెల్లా గొప్ప ఉపాధి ప్రదాత”.(జుముఅహ్: 10,11)

    విధివ్రాత నియమాలు – 7


    9) రోజులు, రాతలు ఎప్పుడూ ఒకేలాగుండవు:
     ”మీరు దెబ్బ తిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బ తిన్నారు. మేము ఈ కాల చక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము”.  (ఆలి ఇమ్రాన్:140)
     అద్భుతమైన ఈ సృష్టి వెనక గల పరమార్థంలో ఒకటేమంటే ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కొన్ని వేళల్లో సత్యం గెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో అసత్యం గెలుస్తుంది. అయితే కడకు అల్లాహ్‌ా సత్యానికి గెలుపును, అసత్యానికి ఓటమిని ఇస్తాడు. ఉపకారం ద్వారం అపకారాన్ని దెబ్బ తీస్తాడు. ధర్మం ద్వారా అధర్మం నడ్డి విరుస్తాడు. ఆ విధంగా అసత్యం అధర్మం, అపకారాల మాడు బ్రద్ధలైపో తుంది. ఆఖరికి అది పరాభవంతో పతన మైపోతుంది. ఇది అల్లాహ్‌ా సంప్ర దాయం; తరతరాలుగా, యుగయుగాలుగా.
     నేడు అగ్రరాజ్యాలు కొన్ని పనిగట్టుకొని ఇస్లాంకు వ్యతిరేకంగా, ప్రవక్త (స) వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారానికి కంకణం కట్టుకున్నట్లు అన్పిస్తుంది. ముఖ్యంగా వారి చెప్పుచేతల్లో ఉన్న ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా యూద, క్రైస్తవ లాబీలు ప్రజలలో లేనిపోని వదం తుల్ని వ్యాపింపజేస్తున్నాయి. ఇస్లాంను ఒక ఫోబియాగా చిత్రీకరించి పబ్బం గడువుకోవాలన్నది వారి ఉద్దేశ్యం. అలాగే శాంతి పేరుతో మార ణాయుధాల్ని పిచ్చోడి చేతిలో రాయిలా అడ్డదిడ్డంగా ప్రయోగించి ముస్లిం ప్రజలలో కలవరం, కలకలం సృష్టించాలనీ, వారి ధైర్యసాహసాలను నీరు గార్చి, వారు పరస్పరం విభేదించుకునేలా చేయాలన్నది వారి చిరకాల ఆశ. అయితే ముస్లింలు నేడే కాదు, నాడు సయితం ఈ రకమయిన వదంతులకు, పుకార్లకు ఏమాత్రం తొణకలేదు. సరికదా ద్విగుణీకృత విశ్వాసంతో సమధికోత్సాహంతో ప్రతికూల పవనాలకు ఎదురొడ్డడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా తెలియ జేస్తుంది:
     ‘అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి’ అని ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబులుగా ”మాకు అల్లాహ్‌ చాలు, ఆయన చాలా మంచి కార్యాసాధకుడు” అని వారన్నారు.  (ఆలి ఇమ్రాన్:173)
     ”నిజానికి (ఈ విధమైనటువంటి పుకార్లు సృష్టిస్తున్న) వాడు షైతాన్‌. వాడు తన మిత్ర బృందం గురించి మిమ్మల్ని భయపెడుతున్నాడు. కనుక మీరు అవిశ్వాస మూకల (మోహరింపు)కు భయపడకండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయితే నాకు మాత్రమే భయపడండి”.  (ఆలిఇమ్రాన్:175)
      అల్లాహ్‌ా తన ప్రణాళికననుసరించి సత్య తిరస్కారులకు గడువు ఇస్తూ పోతాడు. తాత్కాలికంగా వారికి సిరిసంపదల్ని, సంతానాదుల్ని, అధికా రాలను కూడా ఇస్తాడు. దేవుడు వారి పక్షం వహించి అపారంగా అను గ్రహిస్తున్నాడని జనులు తలపోస్తారు. అయితే ఈ దైవకృప వారి పాలిట దేవుని గడువుగా పరిణమిస్తుందన్న సంగతి వారు ఎరుగరు. ఫలితంగా వారి పాపం పండుతూ పోతుంది. తిరస్కార వైఖరితో, తల బిరుసుతనంతో వారు ధరిత్రిలో చెలరేగిపోతారు. కడకు అల్లాహ్‌ా వారి పై తన కొరడాను ఝుళిపిస్తాడు. అంతిమ విజయం దైవభీతిపరులకే వర్తిస్తుంది.విధిరాత పట్ల సహనం:
     మనం నిత్యం అల్లాహ్‌ా ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై ఉండేందుకు ప్రయత్నించాలి. నిరతం అల్లాహ్‌ాను స్మరిస్తూ, విశ్వంలోని ఆయన నిదర్శనాల నుండి గుణపాఠం గ్రహిస్తూ ఉండాలి. అట్టి సద్బుద్ధిని ప్రసాదించమని దీనాతిదీనంగా వేడుకోవాలి. ఖచ్చితంగా ఒక రోజు నశించిపోయే ఈ నరలోకం గురించిన మక్కువను తగ్గించుకుని పరలోక శాశ్వత జీవితం కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అల్లాహ్‌ాకు అప్రియమైన అలవాట్ల నుంచి, ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించే చర్యల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. జీవితంలో ఎలాంటి విషమయ పరిస్థితులు ఎదురైనా, సమయం మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలం గా ఉన్నా పరిస్థితుల, పరిసరాల స్వరూపంలో ఎలాంటి పెను మార్పులు పొడచూపినా సరే మనం దైవ విధేయతా మార్గం మీదే నిలకడ, స్థయిర్యం కలిగి ఉండాలి. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
     ”విశ్వాసి వ్యవహారం చాలా వింతైనది. అతని వ్యవహారం మొత్తం అతని కొరకు మేలైనది ఉంటుంది. ఈ భాగ్యం ఒక్క విశ్వాసికి తప్ప మరెవరికి ప్రాప్తించలేదు. అతనికి ఆనంద ఘడియలు ఎదురైతే అందుకు అతను అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అది అతని కోసం మేలు అవు తుంది. ఒక వేళ అతనికి కష్ట స్థితి ఎదురైతే అతను సహనం వహిస్తాడు అది కూడా అతనికి మేలే చేస్తుంది.”  (ముస్లిం)
    ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించిన ప్రజలారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్‌ా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు.” (అల్‌ బఖర:153)
     సహనం రెండు రకాలు – ఒకటి: నిషిద్ధ నిషయాలను, పాపాలను విడనాడటం, వాటికి దూరంగా ఉండటానికి తన్ను తాను నిగ్రహించు కోవడం. భోగలాలసను, మనసైన వాటిని త్యాగం చేయటం. క్షణభంగుర మైన ప్రయోజనాలను వదులుకోవటం వల్ల మనసుకు కలిగే అసం తృప్తిని ఓర్పుకోవటం. రెండు: దైవాదేశాలను పాటించటంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను ఓర్పుతో, నేర్పుతో భరించటం. అంటే మనసుకు, శరీరానికి ఎంత ఇబ్బందిగా తోచినా అల్లాహ్‌ా ఏది ఇష్టమే అదే చేయాలి. దైవం ఇష్ట పడని విషయాల నుండి దూరంగా మసలుకోవాలి. కోర్కెలు, అభిరుచులు ఎంతగా ఉబలాటం చేసినా, ప్రాపంచికి తళుకుబెళుకులు ఎంతగా కవ్వించినా, షైతాన్‌, పసందైన పనులు ఎంత ప్రలోభ పెట్టినా దైవసమ్మతం కాని వాటిని పరిత్యజించాలి. ఇదే అసలు సిసలైన ఓర్పు సహనం!
     దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఓర్చుకోలేని, తొలగించుకోలేని బాధాకరమైన కష్టాల్నుండి, దౌర్భాగ్యం సోకడం నుండి, చెడు తీర్పులు, నిర్ణయాల నుంచి, శత్రువుల పరిహాసం నుంచి మీరు అల్లాహ్‌ా శరణు వేడుకోండి.” (బుఖారీ, ముస్లిం)
     సకల మేళ్ళను సమకూర్చి పెట్టే, సకల చెడుల నుంచి కాపాడే ఒక దుఆను ప్రవక్త (స) మనకు నేర్పించారు అది- ”ఓ అల్లాహ్‌! నేను నీ నుండి నీ ప్రవక్త ముహమ్మద్‌ (స) అర్థించిన మేళ్ళన్నింటిని అర్థిస్తున్నాను. నీ ప్రవక్త ముహమ్మద్‌ (స) వేటి కీడు నుండి నీ శరణు వేడుకున్నారో వాటి కీడు నుండి  నేను నీ శరణు వేడుకుంటున్నాను. సహాయం కోరిన వ్యక్తికి సహాయం అందించగల సమర్థుడవు నీవే. బాధితుని దగ్గరికి చేర్చే వాడవు నీవే. మంచి పనులు చేసే సత్బుద్ధి, చెడుల నుండి కాపాడుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యం నీ నుండే లభిస్తుంది.” (తిర్మిజీ)

    అర్కానుల్ ఈమాన్


    ధర్మం మీద అపారమైన ప్రేమ ఉంటే సరిపోదు …ప్రాథమిక సూత్రాలు తెలుసుకోకుండా వీణ మీటితే అపస్వరాలు పలికినట్లు, ధర్మం విషయం లో సయితం ప్రాథమిక పరిజ్ఞానమే లోపిస్తే అప సవ్యతలు చోటు చేసుకొని అపమార్గం పాల్జే స్తాయి. అఖీదయే ధర్మానికి అసలైన పునాది. అర్కానుల్‌ ఈమాన్‌ ఏమిటో, అర్కానుల్‌ ఇస్లాం ఏమిటో, కలిమా అర్థం ఏమిటో తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించిన ఏ వ్యక్తీ ఎంతో కాలం సత్య బాటన నడవలేడు. ఏ రంగానికయినా, ఏ వ్యాపా రానికయినా ఈ సూత్రమే వర్తిస్తుంది.  ఓ పది లక్షలు పెట్టి వైద్య శిబిరాలు నిర్వహిం చామనుకోండి, లేదా ఓ 10 కోట్లు పెట్టి అనాథల, అభాగ్యుల, వితంతువుల సంక్షేమ  క్షేత్రాలు నిర్మించామనుకోండి – దాన్ని అల్లాహ్‌ా తనకు ఇవ్వబడిన రుణంగా అంగీక రించి ఉత్తమ రీతిలో దాన్ని తిరిగిస్తాడని, అలా చేయడం స్వయంగా అల్లాహ్‌ాను సేవిం చుకున్నట్టే అవుతుందని, అటువంటి బృహ త్తర కార్యం వల్ల అల్లాహ్  ఎంతో ప్రసన్నుడవు తాడని, తన దాసుల అవసరాలు తీర్చడంలో నిమగ్నుడయి ఉండే దాసుని అవసరాలు   స్వయంగా తానే తీరుస్తాడని దైవప్రవక్త (స) వారు పలు ప్రవచనాల ద్వారా రూఢీ అవు తుంది.