4, మార్చి 2014, మంగళవారం

పీస్‌ ఆఫ్‌ మైండ్‌

పీస్‌ ఆఫ్‌ మైండ్‌ అన్న పదం
నా దృష్టిలో మనిషికి వర్తించదు
వర్తించకూడదు కూడా!

మానసిక ప్రశాంతత అనగా
పండయి రాలే చివరి థని
నా అనుభవంలో రుజువైన పదం!
నిజం చెప్పాలంటే
ఎంత చెట్టుకు అంత గాలి, అన్నట్లు
ఎంత మనిషికి అంత బాధ్యత

ప్రశాంతంగా
నిదురించే మనిషి ఎవడున్నాడు?
గాలికి ఊగని చెట్టు ఏది?

నేనొక సముద్రాన్ని మోస్తున్నా!
నీవొక నదిని మోస్తున్నావు!
అతనొక జలపాతాన్ని మోస్తున్నాడు!
అల్లతనేమో చినుకును మోస్తున్నాడు!
నెత్తినేమీ లేకుండా
ఒట్టి చేతుల్తో నడుస్తున్నవారెవరు?

వయసును బట్టి
అతని పరిధిని బట్టి, శక్తిని బట్టి
అతను నివసిస్తున్న పరిసరాల్ని బట్టి
ఎంతో కొంత బరువును
దింపుకుంటూనో ఎత్తుకుంటూనో
మోస్తూనో తిరగక తప్పదు!

పుట్టినప్పటి నుండి పోయే వరకు
దారి పొడవునా
అతని పాద ముద్రలు, తథ్యం

''ఓ మానవుడా! నీవు భారంగా, బలవంతంగా నీ ప్రభువు వైపునకు సాగిపోతున్నావు. ఆయనను కలుసుకోబోతున్నావు''. ( దివ్య ఖుర్‌ఆన్‌- 84: 6)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి